Episode Details

Back to Episodes
19. సృజనాత్మకత సృష్టిస్తుంది

19. సృజనాత్మకత సృష్టిస్తుంది

Season 8 Episode 19 Published 3 years, 5 months ago
Description
'సత్' (వాస్తవమైనది/శాశ్వతమైనది) మరియు 'అసత్' (అవాస్తవం/అశాశ్వతం) గురించి మరింతగా వివరిస్తూ శ్రీకృష్ణుడు నాశనం లేనిది, అన్నింటా వ్యాపించి ఉన్న 'దాన్ని' గురించి మనలను ఆలోచించమంటారు (2.17). ఈ సృష్టి యావత్తు సృష్టికర్త పని అనే సులభమైన అవగాహన కల్గివుండటం చాలా సహజం. కానీ శ్రీకృష్ణుడు స్థిరమైన పరిణామ శక్తి అయిన 'సృజనాత్మకత' దిశగా దృష్టి మల్లించాలని సూచిస్తారు. ఉదాహరణకు 'సృజనాత్మకత' విత్తనాలను మొలకెత్తేలా చేస్తుంది. మొలకను, విత్తనాన్ని (రెండు సృష్టులను) నాశనం చేయొచ్చు, కానీ నిరంతరం పని చేస్తూ ఉండేది, సర్వత్రా వ్యాపించి ఉన్న 'సృజనాత్మకత' మాత్రం నాశనము చేయబడదు. సృష్టికి కాలపరిమితి ఉంటుంది కానీ 'సృజనాత్మకత' కాలాతీతమైనది. సృష్టి పుడుతుంది. మరణం తర్వాత ఉనికిని కోల్పోతుంది. కానీ 'సృజనాత్మకత' నాశనం లేనిది. 'సృజనాత్మకత' అనేదే సృష్టించే క్రమంలో నిజమైన కర్త. ఇది భావనలను, ఉద్వేగాలను సృష్టిస్తుంది. మన దేహం, మనస్సు వంటి భౌతిక స్వరూపాలను సృష్టిస్తుంది. జ్ఞానము, జ్ఞాపకశక్తి అనేవి గతానికి సంబంధించినవి, కానీ సృష్టి (కర్మఫలము) అనేది భవిష్యత్తు లోనిది. 'సృజనాత్మకత' ఎల్లప్పుడూ వర్తమానం లో జరుగుతుంది. 'సృజనాత్మకత' అనేది మేధస్సును, జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇంద్రియాల ద్వారా ఆహ్లాదకరమైన, బాధాకరమైన అనుభూతులను గ్రహించి వాటికి అతీతంగా స్పందించే సామర్థ్యం. మన ఇంద్రియాలకు సృష్టి యొక్క అనుభూతిని పొందే సామర్థ్యం మాత్రమే ఉంది. వాటిని అధిగమిస్తేనే 'సృజనాత్మకత' ను తెలుసుకో గలుగుతాము. మనం 'సృజనాత్మకత' తో మనల్ని మమేకం చేసుకోగలిగి నప్పుడే మన వ్యక్తిగత జీవితంలో కానీ, వృత్తిపరమైన జీవనంలో కానీ ఆనందానికి ఉత్తమమైన క్షణం. ఒక కర్మ యోగికి ఏదో ఒక నైపుణ్యాన్ని సాధించటం ద్వారా ఈ స్థితిని పొందడం చాలా సులభం. సృజనాత్మకతే మన సహజ స్వభావం. కానీ మనం సృష్టితో గుర్తించబడడానికి ఇష్టపడతాము. ఈ విధంగా మనం తప్పుడు గుర్తింపు కలిగి ఉండటం మూలానే మనము కర్తలమన్న భావనకు లోనవుతాము. అహంకారానికి అదే మూలము. 'సృజనాత్మకత' తో మనల్ని మనం గుర్తించుకున్న క్షణం మన చుట్టూ ఉన్న సృజనను చూడవచ్చు. ఇలా చేయాలంటే శ్రీకృష్ణుడు మనల్ని ఇతరులలో, ఇతరుల్ని మనలో, చివరికి తనను అన్నిటా అంతటా చూడాలని ప్రబోధిస్తున్నారు.
Listen Now

Love PodBriefly?

If you like Podbriefly.com, please consider donating to support the ongoing development.

Support Us